ఆశ వర్కర్స్ కు పని భారం తగ్గించాలి. 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. పారితోషకం లేని పనులు.సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు డిమాండ్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశ వర్కర్స్ సమ్మెలో పాల్గొంటామని వనపర్తి డిఎంహెచ్ ఓకి సమ్మె నోటీసు అందజేశారు
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు ,ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుచ్చమ్మ జిల్లా అధ్యక్షురాలు,సునీతలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి .ఆశ వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు స్థిర కనీస వేతనం నెలకు 26,000గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 45వ మరియు 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల ప్రకారం ఆశా వర్కర్లకు పెన్షన్ మరియు ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలన్నారు. ఆశ వర్కర్లను మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను ఎన్ హెచ్ ఎం ని శాశ్వత ఆరోగ్య కార్యక్రమం గా నిర్ణయించాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు అమలులోకి తేవాలన్నారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు , 20 రోజుల క్యాజువల్ సెలవులు, మరియు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రిటర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ప్రకటించే వరకు పదవి విరమణ ఉండరాదు అన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి లు ఆర్ఎన్ రమేష్. సూర్యవంశం రామ్ తదితరులు పాల్గొన్నారు